తెలంగాణ

telangana

ETV Bharat / international

కాలుష్య కోరల్లో దిల్లీ- ప్రపంచంలోనే రెండో స్థానం

ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా మరోసారి పాకిస్థాన్​లోని లాహోర్​ నిలిచింది. రెండో స్థానంలో భారత దేశ రాజధాని దిల్లీ ఉంది. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈమేరకు జాబితా రూపొందించింది.

Lahore again tops list of world's most polluted cities
కాలుష్య కోరల్లో దిల్లీ-ప్రపంచంలోనే రెండో స్థానం

By

Published : Nov 30, 2020, 7:41 PM IST

పాకిస్థాన్​ సాంస్కృతిక రాజధాని లాహోర్​.. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా నిలిచింది. ప్రపంచ నగరాల్లోని వాయు నాణ్యత సూచీల ఆధారంగా అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈమేరకు తేల్చింది.

అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రకారం వాయు నాణ్యత పీఎం 50 పాయింట్ల కంటే తక్కువ నమోదైతే 'సంతృప్తికరం'. గాలి నాణ్యత పీఎం 301 పాయింట్లు దాటితే 'ప్రమాదకరం'.

మొదటి మూడు స్థానాలు

  1. లాహోర్(పాకిస్థాన్)​-పీఎం 423 పాయింట్లు
  2. దిల్లీ(భారత్​) - పీఎం 229 పాయింట్లు
  3. కాఠ్​మాండూ(నేపాల్)- పీఎం 178 పాయింట్లు

కలుషిత నగరాల జాబితాలో పాకిస్థాన్​ ఆర్థిక రాజధాని కరాచీ ఏడో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి:దిల్లీలో ఇంకా తీవ్ర స్థాయిలోనే గాలి నాణ్యత

ABOUT THE AUTHOR

...view details