కొవిడ్ వ్యాక్సిన్ ఓ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. భర్త అసలు వ్యవహారం భార్యకు తెలిసేలా చేసింది. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదేంటో మీరూ తెలుసుకోండి.
కొవిడ్‌పై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు తమ ప్రజలకు ఉచిత టీకా ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళ తనకు కరోనా వ్యాక్సిన్ వేయించాల్సిందిగా తన భర్తను కోరింది. అందుకు నిరాకరించిన అతడు తనకు వేరే పని ఉందని చెప్పాడు. దీంతో సదరు మహిళ తన సోదరితో వ్యాక్సినేషన్ కేంద్రానికి చేరుకుంది. సరిగ్గా అదే సమయానికి అదే వ్యాక్సినేషన్ సెంటర్‌కు ఆ మహిళ భర్త వేరే అమ్మాయితో వచ్చాడు.
ఇది గమనించిన బాధిత మహిళ భర్తపై దాడికి దిగింది. అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను కుర్చీలతో కొట్టింది. అడ్డుకునేందుకు ఆ వ్యక్తి నానాపాట్లు పడుతుండడం ఆ వీడియోలో చూడొచ్చు. చివరికి ఏం జరిగిందనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ ఆ భర్త నిజ స్వరూపం భార్యకు తెలిసొచ్చింది. ఈ వ్యవహారం తెలియని అక్కడి ఆరోగ్య సిబ్బంది కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియక తికమక పడ్డారు. చివరికి జరిగింది తెలుసుకుని ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ క్లిప్ సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తుంది.
ఎరక్కపోయి ఇరుక్కున్న భర్తను చూసి పలువురు జాలి పడుతున్నారు. మరికొందరు.. 'చూశారా, వ్యాక్సినేషన్ కేంద్రాలు చాలా డేంజర్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇదీ చదవండి:అదనపు కట్నం కోసం కట్టేసి చిత్రహింసలు!