తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా పర్యటనకు కిమ్​ జోంగ్​ ఉన్​.. - mascow

ఈ నెలలో ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ రష్యా పర్యటనకు వస్తున్నట్లు రష్యా క్రెమ్లిన్​ ప్రకటించింది. అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​తో కిమ్​ భేటీ అవనున్నారని తెలిపింది.

రష్యా పర్యటనకు కిమ్​ జోంగ్​ ఉన్​

By

Published : Apr 18, 2019, 11:02 PM IST

ఉత్తర కొరియా నాయకుడు కిమ్​ జోంగ్​ ఉన్ ఈ నెల చివర్లో రష్యా పర్యటన చేయనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​ ఆహ్వానం మేరకు కిమ్​ పర్యటన ఖరారైనట్లు క్రెమ్లిన్​ ప్రకటించింది.

ఈ సమావేశంలో అమెరికా-ఉత్తర కొరియాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న అణ్వాయుధ ప్రతిష్టంభనపై పుతిన్​ మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది.

ఉత్తర కొరియా సరిహద్దు నగరం వ్లాదివోస్టోక్​ నగరంలో కిమ్​తో పుతిన్​ భేటీ కానున్నారని కొన్ని మీడియాలు ప్రచారం చేశాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో మూడోసారి సమావేశానికి సుముఖంగా ఉన్నానని గత వారం ప్రకటించారు కిమ్​. కానీ ఈ ఏడాది చివరిలోపు పరస్పర అంగీకార ఒప్పందానికి తుది గడువు విధించారు.

సోవియట్​ కాలం నుంచి ప్యోంగ్యాంగ్​తో.. మాస్కో మంచి సంబంధాలు కలిగి ఉంది. ఉత్తర కొరియాలో డజన్ల కొద్ది పరిశ్రమలు, కీలక మౌలిక సదుపాయాల కల్పన, ఆయుధ సామగ్రి వంటివి సమకూర్చింది.

ABOUT THE AUTHOR

...view details