తన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో నేపాల్ ప్రధానమంత్రి కే పీ శర్మ ఓలి శనివారం కీలక సమావేశాలు జరిపారు. తొలుత నేపాల్ రాష్ట్రపతి బైద్యదేవీ భండారీతో భేటీ అయిన ఓలి.. అనంతరం తన మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తనను గద్దె దించడానికి కుట్ర జరుగుతోందని.. అందువల్ల అందరూ దేనికైనా సిద్ధంగా ఉండాలని మంత్రులకు ఓలి తెలిపినట్టు సమాచారం.
"పార్టీ ఐకమత్యం ప్రమాదంలో పడింది. ఏదైనా జరగొచ్చు. రాష్ట్రపతికి, నాకు వ్యతిరేకంగా కొందరు కుట్ర పన్నుతున్నారు. మీరందరూ(మంత్రులు) ఓ స్పష్టతకు రావాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి."