దక్షిణ మహా సముద్రంలో ఇటీవల విభిన్నమైన తిమింగలాన్ని కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. అది సాధారణ జాతి తిమింగలంలా లేదని బహుశా కొత్త జాతికి చెందిన జీవి కావచ్చని భానిస్తున్నారు.
ఆ జీవి నుంచి సేకరించిన కణాన్ని 'డీఎన్ఏ' పరీక్షకు పంపారు. దాని నుంచి వచ్చే ఫలితాల ఆధారంగా అది కొత్త రకం జీవి అవునా, కాదా అనే విషయం వెల్లడి కానుంది. 'జాతీయ సముద్ర పర్యావరణ పర్యవేక్షణ సంస్థ' మాత్రం ఎటువంటి పరీక్షలు పూర్తవకుండానే అది భిన్న జాతి జీవి అని ధీమాగా ఉంది.