దక్షిణ కొరియాలోని కరోనా వ్యాక్సిన్, చికిత్సకు సంబంధించిన సాంకేతికతను దొంగలించేందుకు ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రయత్నించారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా వెల్లడించింది.
ఏది నిజం?
పార్లమెంట్‌కు చెందిన నిఘా కమిటీ సభ్యుడు హా టే-కియుంగ్.. మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ సాంకేతికత కోసం ఉత్తర కొరియా హ్యాకర్లు ఫైజర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని, ఆ విషయాన్ని నిఘా సంస్థ తనకు స్వయంగా చెప్పిందని ప్రకటించారు.
అయితే హా వ్యాఖ్యలను నిఘా సంస్థ తోసిపుచ్చింది. ఉత్తర కొరియా హ్యాకర్లు టీకా వివరాలను దొంగలించే ప్రయత్నం చేశారని మాత్రమే చెప్పామని.. ఫైజర్ పేరు ప్రస్తావించలేదని పేర్కొంది.
నిఘా వ్యవస్థ తీరును హా తప్పుపట్టారు. ఫైజర్ పేరును తాను స్పష్టంగా విన్నానని పేర్కొన్నారు. ఉత్తర కొరియాను ఆగ్రహానికి గురిచేయకుండా ఉండేందుకే ఇలా చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఉత్తర కొరియా వ్యవహారంపై ఫైజర్ స్పందించింది. టీకా సమాచారం హ్యాక్ అయ్యిందా? లేదా? అన్నది తెలుసుకునే పనిలో ఉన్నట్టు వెల్లడించింది.
ఇదీ చూడండి:-ఆంక్షలు బేఖాతరు- ఆగని కిమ్ అణు కార్యకలాపాలు