ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఓ పిల్లల నర్సరీ అడవిని తలపిస్తుంది. ఇదంతా పిల్లల ఆడుకోవడానికి సిద్ధం చేశారు. పిల్లలు బొమ్మలతో ఆడుకునే బదులుగా మొక్కలు నాటుతూ, చెట్లకు నీరు పోస్తూ, రాళ్లతో ఆడుకుంటూ సమయాన్ని గడుపుతుంటారు.
దీని పేరు ఇసాబెల్ హెండర్సన్ కిండర్ గార్టెన్. మెల్బోర్న్లోని రన్ సెంటర్ కమ్యూనిటీలో ఓ పాతపడిన ఫ్యాక్టరీని అటవీ ప్రాంతంగా మార్చారు.
బొమ్మలను తొలగించడం ద్వారా పిల్లలు స్వతహాగా తమ వినోదాన్ని తామె వెతుక్కొని, చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. దీనివల్ల సృజనాత్మకత పెరుగుతుంది. ప్రతి కదలిక, ఆలోచన, అనుభవం, సందర్భం.. ఒక్కో జ్ఞాపకంగా మారుతుంది. ఈ స్మృతులు మెదడు పొరల్లో నిక్షిప్తమవుతూ వారి ఆలోచన శక్తిని అభివృద్ధి చేస్తుంది. వారికి భవిష్యత్తులో ప్రకృతితో కలిసి జీవించటం అలవరచుకుంటారు.