తెలంగాణ

telangana

ETV Bharat / international

Kim slim: దేశం కోసం తక్కువ తిని స్లిమ్​గా మారిన కిమ్! - international news latest

Kim slim: ఉత్తరకొరియా నాయకుడు కిమ్​ జాంగ్ ఉన్​ మరింత సన్నగా మారారు. ఇందుకు సంబంధించి ఇటీవల ఆ దేశ మీడియా విడుదల చేసిన ఫొటోలు వైరల్​గా మారాయి. 'అధినేత ఆరోగ్యంగా ఉన్నారు. దేశం కోసం ఆయన తక్కువగా తింటున్నారు’ అని ఓ మీడియా కథనం పేర్కొంది

kim slim, కిమ్​
స్లిమ్​గా మారిన కిమ్.. ఫొటోలు​ వైరల్​

By

Published : Jan 4, 2022, 7:43 AM IST

Kim slim: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, ఆయన పాలిస్తున్న దేశం గురించి ప్రతివార్తా ఆసక్తికరంగానే ఉంటుంది. గత కొద్దికాలంగా కిమ్ ఆరోగ్యం, ఆయన స్లిమ్‌గా మారడం గురించే వార్తలు వస్తున్నాయి. ఇటీవల అక్కడ మీడియా విడుదల చేసిన ఫొటోలు చూస్తుంటే ఆయన మరింత సన్నగా మారినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో తీసిన చిత్రాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

స్లిమ్​గా మారిన కిమ్.. ఫొటోలు​ వైరల్​

దీనిపై అక్కడి అధికారులు మాట్లాడుతూ..‘అధినేత ఆరోగ్యంగా ఉన్నారు. దేశం కోసం ఆయన తక్కువగా తింటున్నారు’ అని వెల్లడించారని మీడియా కథనం పేర్కొంది. ప్రస్తుతం ఉత్తర కొరియా ఆహార కొరతతో అలమటిస్తోంది. కరోనా వైరస్‌ కట్టడికి సరిహద్దుల వెంబడి కఠిన ఆంక్షలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆ దేశ అణుకార్యక్రమంపై అంతర్జాతీయ నిబంధనలు.. కిమ్ సామ్రాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటన్నింటి వల్ల ఆహార లభ్యతపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో ప్రజలంతా తక్కువ తినాలంటూ కిమ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

North korea leader

ఇక గత ఏడాదిలో కూడా కిమ్ సన్నబడిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. 20 కేజీల బరువు తగ్గి కనిపించడంతో.. అందుకు అనారోగ్యం కారణమనే వార్తలు వినిపించాయి. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, శరీరాకృతి కోసం చేసిన ప్రయత్నాల వల్ల సన్నబడి ఉండొచ్చని మరో కథనం పేర్కొంది. అయితే అప్పటికే ప్రజలంతా ఆకలితో అలమటిస్తుంటే.. తమ అధినేత సన్నగా మారిన దృశ్యాలను చూసి ప్రజల హృదయాలు ఎంతగానో కలత చెందాయంటూ అధికారిక మీడియా సంస్థ రాసుకొచ్చింది.

kim jong un news

తాను పగ్గాలు చేపట్టి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో కిమ్ మాట్లాడారు. మామూలుగా అమెరికా, దక్షిణకొరియా గురించి మాట్లాడే కిమ్.. ఈసారి ప్రజల జీవన ప్రమాణాలు, ట్రాక్టర్ ఫ్యాక్టరీలు, పాఠశాల యూనిఫాంలు, అభివృద్ధి గురించి ప్రస్తావించారు. దేశం జీవన్మరణ పోరాటాన్ని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. ప్రజలంతా కఠిన పరిస్థితులు అనుభవిస్తోన్న సమయంలో.. తన సైనిక ప్రణాళిక గురించి మాట్లాడటం మంచి ఆలోచన కాదని కిమ్ భావించి ఉండొచ్చంటూ కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:టర్కీలో ధరల భగభగ.. తిండి కూడా కొనుక్కోలేని దుస్థితి!

ABOUT THE AUTHOR

...view details