ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఆయన కోమాలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించిందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా విడుదైలన ఫొటోలతో ఇదంతా అసత్య ప్రచారమని రుజువవుతోంది. టైఫూన్ బవి తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించారు కిమ్. ఈ సందర్శనకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. అయితే ఆయన ఎప్పుడు పర్యటించారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఫొటోలను గమనిస్తే బహుశా గురువారం మధ్యాహ్నం ఆయన సందర్శన జరిగి ఉంటుందని తెలుస్తోంది.
కిమ్ కోమాలో లేరు.. ఇదిగో సాక్ష్యం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారని కొద్ది రోజులుగా వదంతులు వ్యాపిస్తున్న తురుణంలో ఆయన మళ్లీ ప్రత్యక్షమయ్యారు. టైఫూన్ బవి తుపాను కారణంగా పంటనష్టం జరిగిన ప్రాంతాలను సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆ దేశ మీడియా విడుదల చేసింది.
కిమ్ కోమాలో లేరు.. ఇదిగో సాక్ష్యం
టైఫూన్ బవి తుపాను కారణంగా ఉత్తరకొరియాలో వరదలు సంభవించి తీవ్రనష్టం వాటిల్లింది. దక్షిణ హవాంఘే రాష్ట్రంలో గురువారం కొండచరియలు విరిగిపడ్డాయి.