తెలంగాణ

telangana

ETV Bharat / international

కిమ్​ జోంగ్ ఉన్​ తాత మృతి- 100 ఏళ్ల వయసులో...

Kim Il sung brother: ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్​ ఇల్​ సంగ్​ సోదరుడు, వర్కర్స్​ పార్టీ కీలక నేత కిమ్​ యోంగ్​ జు మృతి చెందారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు ప్రస్తుత అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​.

kim-yong-ju
ఉత్తర కొరియా కీలక నేత కిమ్​ యోంగ్​ జు మృతి

By

Published : Dec 15, 2021, 3:16 PM IST

Kim Il sung brother: ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, తొలి అధినేత కిమ్​ ఇల్​ సంగ్​ తమ్ముడు కిమ్​ యోంగ్​ జు(100) కన్నుమూశారు. ఆయన మేనల్లుడు పరిపాలన పగ్గాలు చేపట్టే వరకు దేశంలో రెండో అతిపెద్ద అధికారిగా వ్యవహరించారు యోంగ్​.

కిమ్​ యోంగ్​ జు మృతిపట్ల సంతాపం తెలిపారు.. ఉత్తర కొరియా అధినేత, కిమ్​ ఇల్​ సంగ్​ మనుమడు కిమ్​ జోంగ్​ ఉన్. సంతాపం తెలుపుతూ పుష్పగుచ్ఛం పంపించినట్లు కొరియా సెంట్రల్​ న్యూస్​ ఏజెన్సీ తెలిపింది. 'కీలక పదవుల్లో ఉన్న సమయంలో వర్కర్స్​ పార్టీ విధానాలను అమలు చేసేందుకు కిమ్​ యోంగ్​ జు తీవ్రంగా కృషి చేశారు. సోషలిస్ట్​ విధానాలు, కొరియన్​ స్టైల్​ సామాజిక వ్యవస్థ కోసం పాటుపడ్డారు.' అని కేసీఎన్​ఏ పేర్కొంది.

అయితే, కిమ్​ యోంగ్​ జు ఎప్పుడు మరణించారనే విషయాన్ని వెల్లడించలేదు.

సియోల్​ ఏకీకరణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. యోంగ్​ జు 1920లో జన్మించారు. ఆయన మరణించినప్పటికి 100 లేదా 101 ఏళ్లు ఉంటాయని పేర్కొంది. 1948లో కిమ్​ ఇల్​ సంగ్​ దేశాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి.. కిమ్​ కుటుంబానికి చెందిన మూడు తరాలు ఉత్తర కొరియాను పాలించాయి. కిమ్​ ఇల్​ సంగ్​ 1994లో మరణించిన తర్వాత ఆయన పెద్ద కుమారుడు కిమ్​ జోంగ్​ ఇల్​ అధికారాన్ని చేపట్టారు. ప్రస్తుత అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​.. కిమ్​ జోంగ్​ ఇల్​ మూడో కుమారుడు. 2011లో తన తండ్రి మరణం తర్వాత అధికారంలోకి వచ్చారు.

ఇదీ చూడండి:'అప్పటి వరకు తక్కువ తినండి'- ప్రజలకు కిమ్​ పిలుపు!

ABOUT THE AUTHOR

...view details