తెలంగాణ

telangana

ETV Bharat / international

న్యూజిలాండ్​ మంత్రిగా ప్రియాంక - indian origin woman sworn in as NZ Minister

న్యూజిలాండ్​ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా ప్రియాంక రాధాకృష్ణన్ చరిత్ర సృష్టించారు. కివీస్ ప్రధాని జెసిండా అర్డెర్న్​ కేబినెట్​లో సామాజిక, స్వచ్ఛంద విభాగ శాఖ మంత్రిగా ఆమెకు అవకాశం దక్కింది.

Keralite Priyanca Radhakrishnan sworn in as NZ Minister
న్యూజిలాండ్ మంత్రిగా తొలిసారి భారత సంతతి మహిళ

By

Published : Nov 2, 2020, 1:06 PM IST

Updated : Nov 2, 2020, 1:43 PM IST

కేరళ మూలాలున్న ప్రియాంక రాధాకృష్ణన్​కు అరుదైన గౌరవం లభించింది. న్యూజిలాండ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. కివీస్ ప్రధాని జెసిండా అర్డెర్న్ కేబినెట్​లో సామాజిక, స్వచ్ఛంద విభాగ శాఖ మంత్రిగా ప్రియాంకకు అవకాశం దక్కింది.

41 ఏళ్ల ప్రియాంక రాధాకృష్ణన్ చెన్నైలో జన్మించి సింగపూర్​లో పెరిగారు. ఆమె కుటుంబీకులకు కేరళ కొచ్చి మూలాలున్నాయి.

ఉన్నత చదువుల కోసం..

ఉన్నత చదువుల కోసం న్యూజిలాండ్​ వెళ్లారు ప్రియాంక. క్రైస్ట్​ చర్చికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. 2004 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఆక్లాండ్ నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఓనం పండుగ సందర్భంగా గతేడాది న్యూజిలాండ్ ప్రధానితో కలిసి కేరళ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పి బాగా ప్రాచుర్యం పొందారు.

ప్రియాంకకు మలయాళం పాటలంటే చాలా ఇష్టం. కేజే ఏసుదాస్​ అంటే ఆమెకు అమితమైన అభిమానం.

Last Updated : Nov 2, 2020, 1:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details