తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​-పాక్ మధ్య నేడు కర్తార్​పుర్ నడవా ఒప్పందం! - కర్తార్​పుర్ కారిడార్

కర్తార్​పుర్​ నడవాకు సంబంధించి నేడు భారత్​తో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని పాక్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య బుధవారమే ఒప్పందం జరగాల్సి ఉంది.

భారత్​-పాక్ మధ్య నేడు కర్తార్​పుర్ నడవా ఒప్పందం!

By

Published : Oct 24, 2019, 6:23 AM IST

భారత్​తో కర్తార్​పుర్ నడవా విషయంపై నేడు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని పాకిస్థాన్ తెలిపింది. భారత్​ కూడా అందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

"కర్తార్​పుర్ నడవాకు సంబంధించి గురువారం భారత్​తో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం."

- మహ్మద్ ఫైసల్​, పాక్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి

అంగీకారం కుదిరింది..!

భక్తులు, యాత్రికులు ఉదయం వచ్చి పాక్​లోని గురుద్వారా దర్బార్ సాహిబ్​ను దర్శించుకుని సాయంత్రం తిరిగి స్వస్థలాలకు చేరుకునేలా భారత్​-పాక్​ ఓ అంగీకారానికి వచ్చాయని ఫైసల్​ పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం 5,000 మంది యాత్రికులను పవిత్ర స్థలాన్ని సందర్శించేందుకు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.

రుసుము చెల్లించాల్సిందే..!

ప్రతి సందర్శకుడు కచ్చితంగా 20 డాలర్లు రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని ఫైసల్​ స్పష్టం చేశారు. ఒప్పందం కుదిరిన తరువాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. రుసుము వసూలు విషయంలో భారత్​ వైఖరి భిన్నంగా ఉన్నప్పటికీ ఒప్పందంపై సంతకం చేయడానికి సన్నద్ధమైంది.

మేము సిద్ధం..

కేంద్రహోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి.. కర్తార్​పుర్ కారిడార్ సమీపంలోని జీరో పాయింట్​ వద్ద పాకిస్థాన్ అధికారులను సోమవారం కలిశారు. నడవా విషయంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్​ సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి(నవంబరు12)కి ముందు కర్తార్​పుర్ నడవా ప్రారంభించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

ఇదీ చూడండి:పండుగ వేళ పసిడి పరుగు... రూ.39వేలకు చేరువలో...


ABOUT THE AUTHOR

...view details