తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​-నేపాల్ కాలాపానీ రగడపై చైనా కీలక వ్యాఖ్యలు - india nepal boarder issue latest news

కాలపానీ వివాదం భారత్​- నేపాల్​ దేశాలకు సంబంధించిందని చైనా వ్యాఖ్యానించింది. నేపాల్​ను ఉద్దేశపూర్వకంగానే చైనా రెచ్చగొడుతోందన్న విశ్లేషణల నడుమ ఈ ప్రకటన చేసింది.

Kalapani is an issue between India and Nepal: China
'కాలపానీ' భారత్​-నేపాల్ దేశాలకు సంబంధించిన సమస్య​: చైనా

By

Published : May 19, 2020, 7:42 PM IST

'కాలపానీ' సరిహద్దు వివాదం భారత్​-నేపాల్​ దేశాలకు సంబంధించిన విషయమని చైనా వ్యాఖ్యానించింది. ఇరు దేశాలు ఏకపక్ష ధోరణిని వీడి, స్నేహపూర్వక చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.

ఉత్తరాఖండ్​ దార్చులాలో రహదారి నిర్మాణంపై నేపాల్​ అభ్యంతరం వ్యక్తంచేయడం వెనుక ఎవరో ఉన్నారని పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఇటీవల విమర్శలు చేశారు సైన్యాధిపతి ఎంఎం నరవాణే. వీటని ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్. పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసుకోకుండా, ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి:భారత్​, నేపాల్​ మధ్య కయ్యానికి చైనా కుట్ర!

ABOUT THE AUTHOR

...view details