తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​-నేపాల్​ మైత్రికి 'కాలాపానీ' బీటలు! - భారత్​ నేపాల్​ మైత్రి

కాలాపానీ వివాదంపై నేపాల్​ అధ్యక్షుడు ఓలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతం నుంచి తన సైనికులను భారత్​ తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. నేపాల్​ భూభాగంలోని ఒక్క అడుగును కూడా ఆక్రమించుకోలేరని స్పష్టం చేశారు.

భారత్​-నేపాల్​ మైత్రికి 'కాలాపానీ' బీటలు!

By

Published : Nov 19, 2019, 5:16 AM IST

Updated : Nov 19, 2019, 8:15 AM IST

భారత్​-నేపాల్​ మైత్రికి 'కాలాపానీ' బీటలు!

భారత్​-నేపాల్​ మధ్య 'కాలాపానీ' వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా.. నేపాల్​ భూభాగంలోని ఒక్క అడుగును కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని వ్యాఖ్యానించారు ఆ దేశ ప్రధానమంత్రి కే.పీ. ఓలీ. కాలాపానీ నుంచి తమ సైనికులను ఉపసంహరించుకోవాలని భారత్​ను కోరనున్నట్టు తెలిపారు.

"ఎంతో దేశభక్తి ఉన్న ప్రభుత్వం మాది. నేపాల్​ భూభాగంలోని ఒక్క అడుగు కూడా ఆక్రమించుకోనివ్వదు. కాలాపానీ ప్రాంతం నుంచి భారత్.. తన సైనికులను ఉపసంహరించుకోవాలి. ఈ వివాదాన్ని దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని మా ప్రభుత్వం కోరుకుంటోంది."
--- ప్రధాని ఓలీ కార్యాలయం.

జమ్ముకశ్మీర్​, లద్ధాఖ్​​.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించిన అనంతరం భారత్​ కొత్త మ్యాప్​లను విడుదల చేసింది. వీటిలో పీఓకే(పాక్​ ఆక్రమిత కశ్మీర్​)​.. జమ్ముకశ్మీర్​లో, గిల్​గిత్​-బాల్టిస్థాన్​ ప్రాంతం లద్ధాఖ్​​లో ఉన్నాయి.

దేశ సరిహద్దును రక్షించుకోగలిగే సత్తా తమ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు ఓలీ. నేపాల్​కు చెందిన అక్రమిత భూములను తిరిగి పొందడానికి తమ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

కాలాపానీ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రతిపక్ష నేపాల్​ కాంగ్రెస్​ పార్టీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Nov 19, 2019, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details