అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
మరోవైపు దేశంలో హింసను అదుపులోకి తెచ్చేందుకు అఫ్గాన్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తాలిబన్లతో అధికారం పంచుకునే ఒప్పందానికి సిద్ధమైంది. ఈ మేరకు ఖతార్‌లోని అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌కు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అఫ్గానిస్థాన్‌లోని ఇప్పటికే కీలక ప్రాంతాలు తాలిబన్ల వశమైన నేపథ్యంలో కాబూల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.