తెలంగాణ

telangana

ETV Bharat / international

కాబూల్​లో ఉగ్రదాడి... - kabul

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్​లో​ ఉగ్రదాడి జరిగింది. మాజీ అధ్యక్షుడితో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరైన కార్యక్రమం సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

కాబూల్​లో ఉగ్రదాడి

By

Published : Mar 8, 2019, 7:43 AM IST

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రదాడి జరిగింది. అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమిద్‌ కర్జాయి, ముఖ్య కార్యనిర్వాహణాధికారితో పాటు పలువురు రాజకీయ నేతలు ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతంలో బాంబు పేలుళ్లూ సంభవించాయి. ఉగ్రమూకల దాడిలో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారన్న విషయంపై అధికారులు స్పష్టతనివ్వలేదు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. మరో 32 మందికి గాయాలయ్యాయి.

కాబూల్​లో ఉగ్రదాడి

బాధితుల సంఖ్యపై పూర్తి స్పష్టత రాలేదని తెలిపారు అఫ్గాన్​ వైద్య మంత్రి మొహాయ్​బుల్లా జైర్​. అంతకుముందు మొహమ్మద్‌ అసీమ్‌ అనే అధికారి... 7 మంది మరణించగా...10 మంది గాయపడ్డారని మీడియాకు వెల్లడించారు. క్షతగాత్రులను భద్రతా సిబ్బంది, సహాయక బృందాలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు హాజరయ్యారని అధికారులు తెలిపారు.

కారకులు తెలియలేదు...

ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రసంస్థ ఏదో ఇప్పటి వరకు తెలియలేదు. బాంబు దాడికి సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నుస్రత్‌ రహిమి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details