తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్​ తదుపరి పీఎంగా ఫుమియో కిషిడా! - జపాన్​ ప్రధానిగా ఫుమియో కిషిడా

జపాన్​ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఫుమియో కిషిడా(fumio kishida political views) ఆ దేశ తదుపరి ప్రధానమంత్రిగా(japanese pm news) బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార పార్టీలో నిర్వహించిన అంతర్గత ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా గెలుపొందారు.

Kishida to become new PM
ఫుమియో కిషిడా

By

Published : Sep 29, 2021, 12:24 PM IST

జపాన్ తదుపరి ప్రధానమంత్రిగా(japanese pm news) ఫుమియో కిషిడా ఎన్నికకానున్నారు. ఈ మేరకు సోమవారం జపాన్ పార్లమెంటులో ఎన్నిక జరగనుంది. జపాన్ మాజీ విదేశాంగ మంత్రి అయిన కిషిడా(fumio kishida political views) అధికార పార్టీలో నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా గెలిచారు.

గతేడాది సెప్టెంబరులో ప్రధాని పగ్గాలు చేపట్టిన యొషిహిదే సుగా(Japan PM Yoshihide Suga) స్థానాన్ని.. కిషిడా భర్తీ చేయనున్నారు. సుగా కేవలం ఏడాదిలోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు.

ఫుమియో కిషిడా

లిబరల్‌ డెమొక్రాటిక్ పార్టీ నేత అయిన కిషిడా, భాగస్వామ్య పక్షాల సహకారంతో.. పార్లమెంటులో ప్రధానిగా ఎన్నిక కావడం లాంఛనమేనని సమాచారం. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ మంత్రిగా పనిచేస్తున్న టారో కోనో ప్రధాని అభ్యర్థిగా పోటీపడినప్పటికీ.. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ ఎన్నికల్లో కిషిడానే విజయం వరించింది.

ఇదీ చూడండి:Japan PM Yoshihide Suga: బాధ్యతల నుంచి తప్పుకోనున్న జపాన్‌ ప్రధాని!

ABOUT THE AUTHOR

...view details