కరోనా తెచ్చిన అనిశ్చితి జపాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జపాన్ ఆర్థిక వ్యవస్థ వార్షిక రేటులో 27.8 శాతానికి క్షీణించింది. ఈ మూడు నెలల కాలంలో వినియోగం, వాణిజ్యం భారీగా తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది జపాన్.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జపాన్ ఎగమతులు వార్షిక రేటులో 56 శాతం, ప్రైవేటు వినియోగం దాదాపు 29 శాతం తగ్గినట్లు జపాన్ వెల్లడించింది.