జపాన్ వ్యాపారవేత్త.. ఆన్‌లైన్ రిటైల్ ఫ్యాషన్ దిగ్గజం యుసాకు మేజావా మొట్టమొదటి అంతరిక్ష యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. చంద్రుని వద్దకు చేరుకొనే ముందు.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) చేరుకోనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ అంతరిక్ష నౌక.. మేజావాను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది.
రష్యాకు చెందిన సూయజ్ క్యాప్సూల్‌లో రెండు సీట్లు కొనుగోలు చేసిన మేజావా.. డిసెంబర్‌లో మరో యాత్రికునితో కలసి 12 రోజుల పాటు అంతరిక్షంలో విహరించనున్నారు. రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ మిసుర్కిన్ వీరిని తీసుకువెళతారు. ఈ ఏడాది డిసెంబర్ 8న కజకస్థాన్ నుంచి వీరి రాకెట్ పయనమవుతుంది. ఎలాన్ మస్క్‌కే చెందిన 'స్టార్‌షిప్'లోనూ మేజావా చంద్రుని యాత్రను చేపట్టనున్నారు. ఇది 2023లో ఈ యాత్ర సాగనుంది
"అంతరిక్షంలో గడపబోయే సమయం గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అక్కడ ఎలా ఉంటుందో? అక్కడి పరిస్థితులను స్వయంగా అనుభవించి మిగతా ప్రపంచంతో పంచుకోవాలని ఆలోచిస్తున్నాను."
-యుసాకు మేజావా