జపాన్ టోక్యోలో ఓ టెలికాం సంస్థకు చుక్కలు చూపించిన ఓ వృద్ధుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. సేవలు నచ్చలేదంటూ కస్టమర్ కేర్ సెంటర్కు 24 వేల సార్లు ఫోన్లు చేసి ఫిర్యాదు చేసిన అకిటోషి-ఒకమాటోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జపాన్లో ప్రముఖ టెలీ కంపెనీ కేడీడీఐకి, 71 ఏళ్ల అకిటోషికీ మధ్య వివాదం నెలకొంది. తనతో ఆరంభంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేడీడీఐ ఉల్లంఘించిందంటూ ఆరోపించాడు ఆ పెద్దాయన. వారి సేవలు తనకు ముందు చెప్పిన విధంగా లేవంటూ కస్టమర్ సర్వీస్ సెంటర్కు ఫోన్లు చేయడం ప్రారంభించాడు.