తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒలింపిక్స్​ వేళ కరోనా​ బీభత్సం- జపాన్​ కీలక నిర్ణయం - delta variant in world

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి.. మరోసారి పంజా విసురుతోంది. ఒలింపిక్స్​ జరుగుతున్న జపాన్​ టోక్యో నగరంలో కరోనా కొత్త కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. దాంతో.. ఎమర్జెన్సీని టోక్యోతోపాటు మరిన్ని నగరాలకు ఆ దేశం విస్తరించింది. మరోవైపు.. అమెరికా ఫ్లోరిడాలోని ఆస్పత్రులన్నీ కొవిడ్​ బాధితులతో కిటకిటలాడుతున్నాయి.

corona in world
ప్రపంచ దేశాల్లో కరోనా

By

Published : Jul 30, 2021, 11:59 AM IST

Updated : Jul 30, 2021, 2:28 PM IST

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా వివిధ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఒలింపిక్​ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న జపాన్​లో కరోనా విజృంభణ.. ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. దాంతో అక్కడి ప్రభుత్వం.. వైరస్ కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు.. టోక్యో నగరానికే పరిమితమైన అత్యయిక స్థితిని.. పొరుగు నగరాలకూ విస్తరించింది.

సైతామా, కానాగ్వా, చిబా సహా పశ్చిమ నగరమైన ఒసాకాలో అత్యయిక స్థిని విధిస్తున్నట్లు జపాన్​ ప్రధానమంత్రి యోషిహెదో శుక్రవారం తెలిపారు. సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు ఈ నగరాల్లో అత్యయిక స్థితి కొనసాగుతుందని చెప్పారు.

టోక్యోలో వరుసగా మూడోరోజు కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. గురువారం అక్కడ 3,865 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. వారం వ్యవధిలో అక్కడ రెట్టింపు స్థాయిలో కరోనా కేసులు కనిపిస్తున్నాయి. వచ్చే వారంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 4,500కు చేరుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రమాదకర వేరియంట్లూ తల వంచాల్సిందే!

ఫ్లోరిడాలో కలకలం...

అమెరికాలోని ఫ్లోరిడాలో కరోనా డెల్టా వేరియంట్​ విజృంభణ కొనసాగుతోంది. వైరస్​ బారిన పడి ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత రెండు వారాలుగా అక్కడ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య.. గతేడాది వేసవికాలం నాటి వైరస్​ ఉద్ధృతిని గుర్తు చేస్తోంది. కరోనా కట్టడికి ఎమర్జెన్సీ​ విధించాలని స్థానిక అధికారులు... ఫ్లోరిడా గవర్నర్​పై ఒత్తిడి తెస్తున్నారు.

ఫ్లోరిడాలోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా వార్డులన్నీ కిటికిటలాడుతున్నాయి. ఎమర్జెన్సీ పడకలన్నీ రోగులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు పరీక్షల కోసం.. ఫ్లోరిడా వాసులు పెద్ద సంఖ్యలో తమ కార్లలో.. పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరి నిరీక్షిస్తున్నారు.

ఫ్లోరిడాలో గురువారం ఒక్కరోజే 8,900కు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయని అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం తెలిపింది. గురువారం నమోదైన కేసుల సంఖ్య... గత నెలలో నమోదైన కేసుల కంటే ఐదు రెట్లు ఎక్కువ అని ఫ్లోరిడాలోని వైద్య వర్గాలు తెలిపాయి. వారం వ్యవధిలోనే రోజువారీ కేసుల్లో 5,500కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని చెప్పాయి.

ఇదీ చూడండి:'టీకా తీసుకోని వారంతా హౌస్ అరెస్ట్!'

టీకా తీసుకున్నా, లేకపోయినా..​

అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. వాషింగ్టన్​లో కొత్త నిబంధనలను విధించేందుకు అక్కడి అధికారులు సిద్ధమవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నారా, లేదా అన్నదానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించాల్సిందేనని తెలిపారు. ఈ నిబంధనలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని వాషింగ్టన్​ మేయర్​ మ్యూరియల్​ బౌసర్​ పేర్కొన్నారు.

అంతకుముందు అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) కూడా ఇదే తరహాలో.. వ్యాక్సిన్​ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించాల్సిందేనని తన మార్గదర్శకాలను సవరించింది.

ఇదీ చూడండి:టీకా తీసుకున్నా మళ్లీ కరోనా.. ఎందుకిలా?

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,61,194 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 10,464 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 19,73,19,270కి చేరగా.. మరణాల సంఖ్య 41,59,695కు పెరిగింది.

దేశం కొత్త కేసులు
అమెరికా 92,485
బ్రెజిల్ 41,853
ఫ్రాన్స్ 25,190
బ్రిటన్​ 31,117
రష్యా 23,270
టర్కీ 22,161

ఇదీ చూడండి:కట్టలు తెంచుకుంటున్న కరోనా- ఆ దేశాలు విలవిల

ఇదీ చూడండి:'ఆస్ట్రాజెనెకా రెండో డోసుతో ఆ ముప్పు లేనట్లే'

Last Updated : Jul 30, 2021, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details