తూర్పు చైనా సముద్రంలోని ద్వీపాల విషయంలో చైనాపై అసంతృప్తి వ్యక్తం చేసింది జపాన్. ఈ మేరకు.. చైనా విదేశాంగ మంత్రి జపాన్ పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని లేవనెత్తింది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రెండు రోజుల పాటు జపాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు దుందుడుకు చర్యలను నివారించాలని నిర్ణయించుకున్నాయి. ఇటీవలి కాలంలో చైనా-జపాన్ల మధ్య చాలా మేరకు ఒప్పందాలు కుదిరాయి. కానీ, ప్రాదేశీక భూభాగాల విషయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే.. విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. వ్యాపార సంబంధాల్లోనూ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.