తెలంగాణ

telangana

ETV Bharat / international

రాజీనామా దిశగా జపాన్​ ప్రధాని షింజో - జపాన్​ ప్రధాని షింజో ఆరోగ్య పరిస్థితి

తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నారు జపాన్​ ప్రధాని షింజో అబే. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా వెల్లడించింది. ఆయన గత కొంతకాలంగా అల్సరేటివ్​ కొలిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంది.

Japan PM to resign amid health concerns: Reports
రాజీనామా దిశగా జపాన్​ ప్రధాని షింజో

By

Published : Aug 28, 2020, 1:25 PM IST

జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే తన పదవికి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. తన ఆరోగ్య పరిస్థితుల వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకూడనే ఇలా చేయాలని అనుకుంటున్నట్లు వివరించింది. అయితే... ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, పార్టీ ముఖ్య సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

గత కొన్నేళ్లుగా అల్సరేటివ్ కొలిటిస్​ అనే వ్యాధితో బాధపడుతున్న అబే... ఇటీవల వారం వ్యవధిలోనే రెండు సార్లు ఆస్పత్రికి వెళ్లారు.

కానీ పార్టీ వర్గాలు మాత్రం ప్రధాని ఆరోగ్యం మరో విధంగా స్పందించాయి. చికిత్స అనంతరం షింజో ఆరోగ్యంగా ఉన్నారని, ఎంతో చురుకుగా పని చేస్తున్నట్లు తెలిపాయి.

2007లోనూ ఆరోగ్య సమస్యలతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు షింజో. ఈ నేపథ్యంలోనే మళ్లీ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఎక్కువ కాలం

1964 నుంచి 1972 వరకు 2,798 రోజులు ప్రధానిగా సేవలందించిన తన ముత్తాత ఐసాకు సాటో రికార్డును సోమవారంతో అధిగమించారు షింజో. దీంతో జపాన్​ ప్రధానిగా ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తిగా రికార్డుకెక్కారు.

ABOUT THE AUTHOR

...view details