జపాన్ను అత్యధిక కాలంగా పాలిస్తున్న ప్రధాని షింజో అబే.. తన పదవికి గుడ్‌బై చెప్పేశారు. ఈ విషయంపై శుక్రవారం అనూహ్యంగా ప్రకటన చేసిన ఆయన.. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అల్సరేటివ్ కొలిటిస్ అనే పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
"ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆత్మవిశ్వాసంతో ప్రజలను పాలించే స్థితిలో లేను. అందుకే ఇకపై ఆ పదవిలో కొనసాగకూడదని అనుకున్నాను. కరోనా వైరస్ క్లిష్టకాలంలో, పలు విధాన నిర్ణయాలు అమలు దశకు రాకముందే, ఏడాది పాటు పదవీకాలం మిగిలుండగానే.. రాజీనామా చేస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను"