జపాన్ ప్రధానిగా ఇటీవల ఎన్నికైన ఫుమియో కిషిడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులోని దిగువ సభను రద్దు(japan lower house) చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా నిర్ణయంతో అక్టోబరు 31న జపాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు మార్గం సుగమమైంది. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో.. ప్రధాని భాద్యతలు చేపట్టిన 10రోజులకే కిషిడా.. దిగువ సభను రద్దు చేయటం గమనార్హం.
తన పాలనకు ప్రజల ఆమోదం పొందేందుకే ఎన్నికలకు వెళ్తున్నట్లు కిషిడా స్పష్టం చేశారు. ఈ ప్రకటన అనంతరం దిగువ సభను రద్దు చేస్తున్నట్లు దిగువ సభ స్పీకర్ తడమొరి ఓషిమా ప్రకటించారు.