జపాన్లో పదేళ్ల కింద సునామీ సృష్టించిన బీభత్సంతో ఫుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ పేలి భారీ విధ్వంసానికి దారి తీసింది. ఆ ప్రమాదంలో వేలాది మంది ప్రజలు మరణించారు. ఆ సంఘటన జరిగి గురువారానికి పదేళ్లు కాగా.. నాడు చనిపోయిన వారికి జపాన్ చక్రవర్తి నరుహితో, ప్రధాని యోషిండే.. నివాళులర్పించారు. అప్పుడు జరిగిన దుర్ఘటనను గుర్తుచేసుకుని బాధపడ్డారు.
"పదేళ్ల కిత్రం వచ్చిన సునామీ, ఫుకుషిమా న్యూక్లియర్ దుర్ఘటనను తలచుకుంటే బాధేస్తుంది. ఆ దుర్ఘటన వల్ల ఇప్పటికీ కష్టాలను అనుభవిస్తున్న ప్రజలను తలచుకుంచే గుండె బాధతో విలవిల్లాడుతోంది."