కరోనా కట్టడి చర్యల్లో భాగంగా షింజో అబే నేతృత్వంలోని జపాన్ ప్రభుత్వం దేశమంతటా మాస్కులు పంపిణీ చేసింది. అయితే అవి నాసిరకంగా ఉన్నాయని, పాత వస్త్రంతో తయారైనవని ఆరోపణలు చేస్తున్నారు ప్రజలు. గర్భిణీలకు పంపిన వేల మాస్కులు మురికిగా ఉన్నాయని ప్రధానిపై, ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. తమకు మురికి(అసహ్యమైన) మాస్కులు అందాయనే కారణంతో.. 80 మున్సిపాలిటీల్లో సుమారు 1,900 కేసులు నమోదయ్యాయని జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
జపాన్లో మాస్కుల కొరతను అరికట్టేందుకు ప్రధాని.. ఒక్కో ఇంటికి రెండు మాస్కుల చొప్పున పంచాలని ప్రకటించారు. ఇందులో గర్భిణీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం.. సుమారు 5 లక్షల మాస్కులను పంపిణీ చేసింది. అయితే అవన్నీ బాగాలేవని తెలిపారు. అంతేకాకుండా వాటి పరిమాణమూ చాలా చిన్నగా ఉన్నాయని విమర్శించారు.