తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా బాధితులకు 2,000 ఐఫోన్లు.. ఎందుకో తెలుసా? - కరోనా బాధితులకు 2,000 ఐఫోన్లు.. ఎందుకో తెలుసా?

జపాన్​ తీరంలో నిలిపివేసిన నౌకలోని ప్రయాణికులకు ఆ దేశ ఆరోగ్య శాఖ 2 వేల యాపిల్​ ఫోన్లను అందించింది. వీటి​ ద్వారా ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్య పరిస్థితులను వైద్యులకు తెలియజేయవచ్చు.

Japan Gives 2000 iPhones to Passengers on Diamond Princess Cruise Ship
కరోనా బాధితులకు 2,000 ఐఫోన్లు.. ఎందుకో తెలుసా?

By

Published : Feb 16, 2020, 7:25 AM IST

Updated : Mar 1, 2020, 12:03 PM IST

జపాన్ తీరంలో నిలిపివేసిన ఓడలోని ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నౌకలోని ప్రయాణికులకు 2 వేల యాపిల్​ ఫోన్లను అందించింది అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఒక్కో క్యాబిన్​కు ఒక్కో ఫోన్​ను కేటాయించింది.

యాప్​ కోసమే...

జపాన్​ ఆరోగ్య శాఖకు చెందిన హెల్త్​ యాప్​.. ఆ దేశంలో రిజిస్టర్​ అయిన ఫోన్లలోనే పనిచేస్తుంది. నౌకలోని ప్రయాణికులు యాప్​ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని వైద్యులకు తెలియజేయాలంటే.. జపాన్​లో రిజిస్టర్​ అయిన ఫోన్​ తప్పనిసరి. ఈ కారణంగా ప్రయాణికులకు ఐఫోన్లను అందించింది.

130 మందికి కరోనా...

జపాన్​ నౌకలో ఇప్పటి వరకు 218 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. నౌకలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ప్రయాణికులకు ఇచ్చిన ఫోన్లు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

నౌకలో మొత్తం 3,711 మంది ఉన్నారు. హాంకాంగ్​లో దిగిన ఓ వ్యక్తి నుంచి నౌకలోని వారికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఫలితంగా అప్పటి నుంచి నౌకను నిర్బంధంలో ఉంచారు. నౌకలో ఉన్న వారిలో ముగ్గురు భారతీయులు సహా 218 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఇద్దరు ఫేస్​బుక్​ రారాజులు త్వరలో కలవబోతున్నారు!

Last Updated : Mar 1, 2020, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details