తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్​లో వరద బీభత్సం- 34 మంది మృతి - జపాన్​లో వరదల బీభత్సం

జపాన్​లో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుమామోటో, కగోషియో ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. కొండచరియలు విరిగిపడి సుమారు 34 మంది మరణించారు.

Japan floods leave some 20 dead
జపాన్​లో వరదల బీభత్సం-20 మంది మృతి!

By

Published : Jul 5, 2020, 1:23 PM IST

Updated : Jul 6, 2020, 3:28 AM IST

జపాన్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 100 మిల్లీమీటర్ల మేర కురిసిన వర్షం వల్ల పట్టణాలు, నగరాలు జలమయం అయ్యాయి. దక్షిణ జపాన్ కుమామోటో ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి సుమారు 34 మంది మరణించారు.

జపాన్​లో వరదల బీభత్సం

సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం కుమామోటో ప్రాంతంలో రెస్క్యూ హెలికాప్టర్లు, 10 వేల మంది రక్షణ దళ సిబ్బంది, కోస్ట్​గార్డ్, అగ్నిమాపక దళాలు యుద్ధప్రాతిపదిన సహాయ చర్యలు చేపడుతున్నాయి.

ఉప్పొంగిన 'కుమా'

కుమా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తీరప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు నీటమునిగాయి. ప్రజలు ఇళ్ల పైకప్పుల మీదకు వచ్చి, సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

కుమాలోని ఓ వృద్ధాశ్రమం వరదనీటిలో చిక్కుకుపోయింది. సెంజుయెన్ ప్రాంతంలో సుమారు 60 మంది స్థానికులు వరదల్లో చిక్కుకున్నారు. వీరు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

కరోనా భయాలు వెన్నాడుతున్నాయ్​

కుమామోటో, కగోషియో ప్రాంతంల్లో సుమారు 75 వేల మంది వరదల్లో చిక్కుకున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉన్నా... కరోనా భయాలు వెంటాడుతున్నాయి. దీనితో తమ ఇళ్లలోనే ఉండాలని వారు నిర్ణయించుకున్నారు.

పలుప్రాంతాల్లో విద్యుత్, సమాచార వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సుమారు 6 వేల గృహాలకు విద్యుత్ నిలిచిపోయింది.

ఇదీ చూడండి:ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ ఆసుపత్రి దిల్లీలో..

Last Updated : Jul 6, 2020, 3:28 AM IST

ABOUT THE AUTHOR

...view details