కొవిడ్ సంక్షోభంలో భారత్కు ఆర్థిక సాయం చేసేందుకు జపాన్ ముందుకొచ్చింది. దాదాపు రూ.2,113 కోట్లు రుణంగా ఇవ్వనుంది. 'అధికారిక అభివృద్ధి సాయం' పేరిట రెండు దేశాల మద్య ఒప్పందం కుదిరింది.
భారత ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి సీఎస్ మొహాపాత్రా, జపాన్ రాయబారి సుజుకీ సతోషి ఈ విషయంపై శుక్రవారం చర్చించారు. ఈ నేపథ్యంలో మొహాపాత్రా, జేఐసీఎ ముఖ్య ప్రతినిధి కట్సువో మట్సుమోటో ఒప్పందంపై సంతకాలు చేశారు.