తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్​ భూకంపంలో నలుగురు మృతి.. 97మందికి గాయాలు

japan earthquake: జపాన్​లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కొల్పోయారు. 97 మంది గాాయాలపాలయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్​స్కేలుపై 7.3గా నమోదైంది. ఫుకుషిమో తీర ప్రాంతంలో 60కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

japan earthquake
జపాన్ భూకంపం

By

Published : Mar 17, 2022, 9:18 AM IST

Updated : Mar 17, 2022, 11:19 AM IST

japan earthquake: జపాన్​ను భూకంపం వణికించింది. ఈశాన్య జపాన్​లోని ఫుకుషిమాలో భూకంపం బుధవారం రాత్రి సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.3గా నమోదైంది. ఈ భూకంపం వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోగా, 97 మంది గాయాలపాలయ్యారు. భూకంప ప్రభావంతో జపాన్ రాజధాని టోక్యో సహా పలు నగరాల్లోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 20 లక్షలకు పైగా ఇళ్లలో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.

జపాన్​లో 11ఏళ్ల క్రితం రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చి సునామీకి కారణమైన ప్రాంతంలోనే ఈసారి భూమి కంపించింది. ఇప్పుడు 7.3 తీవ్రతతో భూకంపం సంభవించవించడం వల్ల దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

"భూకంపం కారణంగా నలుగురు మరణించారు. మరో 97 మంది గాయపడ్డారు. వారి మరణానికి గల కారణాలను తెలుసుకుంటాం. ప్రభుత్వం భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోంది"

-ఫుమియో కిషిడా , జపాన్ ప్రధానమంత్రి

ఇదీ చదవండి:మరో క్షిపణిని ప్రయోగించిన నార్త్​ కొరియా.. అయితే ఈసారి..!

Last Updated : Mar 17, 2022, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details