తెలంగాణ

telangana

గోల్డ్ ఫిష్​ ప్రపంచం చూసొద్దాం రండి!

By

Published : Jul 9, 2019, 4:14 PM IST

గోల్డ్​ ఫిష్... చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటుంది. దాదాపు ప్రతి అక్వేరియంలో కనిపిస్తూ ఉంటుంది. అంతటి క్రేజ్​ ఉన్న గోల్డ్​ ఫిష్​... ఓ ప్రదర్శనకే ప్రధానాంశమైంది. గోల్డ్​ ఫిష్​ థీమ్​తో ఏర్పాటు చేసిన ఎక్వేరియం, గిఫ్ట్​ షాప్​ సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.

ఈ ఎక్వేరియంలో 10వేల చేపల జలకాలాట

ఈ ఎక్వేరియంలో 10వేల చేపల జలకాలాట

ఇప్పుడు మీరు చూస్తున్నది చేపల అక్వేరియమ్​ ప్రదర్శన. ఇక్కడ పదివేల చేపలను వీక్షించొచ్చు. జపాన్​ రాజధాని టోక్యోలో ఈ ప్రదర్శన జరుగుతోంది. గత 13 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. వీక్షించేందుకు 9మిలియన్​ల సందర్శకులు వస్తారని అంచనా.

జపాన్​లో గోల్డ్​ ఫిష్​, రంగు రంగుల చేపలను ఆలంకరణ చేపలుగా చూస్తారు. వాటిని ఎంతో విలువైనవిగా భావిస్తుంటారు. అస్సలు తినరు. వీటి నుంచి ప్రేరణ పొంది కిమురా హిడెటోమో అనే కళాకారుడు ఈ ప్రదర్శనకు వివిధ రకాల కళాత్మక అక్వేరియం ట్యాంకులను రూపొందించారు.

ప్రతిఒక్కరూ ఆనందించాలనే ఉద్దేశంతోనే జపనీస్​ కళ ఉట్టిపడేలా మేము దీన్ని రూపొందించాం. జపనీస్ అనుభూతి కలిగేలా సంగీతం వినిపిస్తూ, గైడ్ చేసేందుకు మ్యాపింగ్ ఇచ్చి... గాజు, యాక్రిలిక్​(పారదర్శక ప్లాస్టిక్ షీట్​)లు కలిపి అద్భుతంగా మలిచాము. సందర్శకులకు ఇదో మధురానుభూతిని కలిగిస్తుంది.

-హిడెటోమో, కళాకారుడు

ఈ ప్రదర్శనను చూడటానికి వచ్చిన సందర్శకులు ఈ మాయాజాలాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని సార్లు సందర్శించినా తృప్తి తీరని అద్భుతమైన కళాకృతిగా ప్రేక్షకులు వారి అనుభూతుల్ని పంచుకున్నారు.

ఇంత అందమైన కళాకృతులను చూడటం నిజంగా ఉత్తేజం కలిగిస్తోంది. ఇది ఒక మాయాజాలం. దీని గురించి మా స్నేహితులకు కూడా తెలియజేస్తాను. మళ్లీ నాతో ఇంకొంత మందిని తీసుకురావాలని నేను అనుకుంటున్నాను.

-మెరీనా సాటో, విద్యార్థి

అక్వేరియం ప్రాంగణంలో ఓ బార్​ కూడా ఉంది. వివిధ రకాల కాక్​టేల్స్ ఇక్కడ సర్వ్ చేస్తారు. గోల్డ్​ ఫిష్ సంబంధిత వస్తువులతో గిఫ్ట్​ షాప్​ కూడా ఉంది. ప్రతి రోజు రాత్రి ఆర్ట్​ అక్వేరియం ప్రధాన వేదిక వద్ద కొన్ని సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గొప్ప ఆనుభూతులు, ఆనందాలనిచ్చే ఈ ప్రదర్శన సెప్టెంబర్​ 23 వరకు జరగనుంది.

ఇదీ చూడండి:లెక్కచేయని ఇరాన్​- అణు ఒప్పందానికి తూట్లు

ABOUT THE AUTHOR

...view details