తెలంగాణ

telangana

ETV Bharat / international

'కార్బన్​ ఫ్రీ' లక్ష్యంతో జపాన్​ సరికొత్త వ్యూహం - గ్రీన్​ గ్రోత్​ స్ట్రాటజీ

2050 నాటికి దేశాన్ని 'కార్బన్ ఫ్రీ​'గా మార్చటమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతోంది జపాన్​. 'గ్రీన్​ గ్రోత్​ స్ట్రాటజీ'లో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే 15 ఏళ్లలోపు చమురు ఆధారిత వాహనాలను పూర్తిగా తొలగించాలని సంకల్పించింది.

Japan adopts green growth plan
కార్బన్​ ఫ్రీ లక్ష్యంగా జపాన్​ సరికొత్త వ్యూహం

By

Published : Dec 25, 2020, 5:06 PM IST

కాలుష్య భూతాన్ని తరిమికొట్టేందుకు భారీ ప్రణాళికలు రచించింది జపాన్​. దేశాన్ని 2050 నాటికి కర్బన ఉద్గారాల​ రహితంగా మార్చడమే లక్ష్యంగా... వచ్చే 15 ఏళ్లలోపు చమురు ఆధారిత వాహనాలను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. అందుకోసం 2030 నాటికి ఆటో పరిశ్రమ 'కార్బన్​ ఫ్రీ'గా మారాలని పిలుపునిచ్చింది. అలాగే.. పర్యావరణహిత వాణిజ్యం, పెట్టుబడుల్లో 2 ట్రిలియన్​ డాలర్ల వృద్ధి సాధించాలని సంకల్పించుకుంది.

'గ్రీన్​ గ్రోత్​ స్ట్రాటజీ'లో భాగంగా పునరుత్పాదక, హైడ్రోజన్​ ఇంధన వాడకాన్ని పెంచాలని దేశంలోని పరిశ్రమ వర్గాలను కోరుతోంది జపాన్ ప్రభుత్వం.

పర్యావరణ కాలుష్యంపై గత అక్టోబర్​లో మాట్లాడిన ప్రధాని యోషిహిడే సుగా.. వచ్చే 30 ఏళ్లలో కర్బన ఉద్గారాలను సున్నాకు తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు.

45 గిగావాట్ల పవన విద్యుత్తు..

పర్యావరణహిత వ్యూహంలో భాగంగా 14 కీలక పరిశ్రమలను గుర్తించింది సుగా ప్రభుత్వం. అందులో ప్రధానంగా పవన, హైడ్రోజన్ విద్యుత్తు​, అమోనియా ఇంధనంతో పాటు రీఛార్జబుల్​ బ్యాటరీలు ఉన్నాయి. 2040 నాటికి 45 గిగావాట్ల పవన విద్యుత్తు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

19 బిలియన్​ డాలర్ల గ్రీన్​ ఫండ్​..

పర్యావరణ హిత వ్యూహంలో భాగంగా ప్రభుత్వం పెట్టుబడిదారులకు పన్ను ప్రోత్సాహకాలు, ఇతర మద్దతు ఇవ్వనుంది. అందుకోసం 19 బిలియన్​ డాలర్ల గ్రీన్​ ఫండ్​ను కేటాయించింది. గ్రీన్​ టెక్నాలజీలో పెట్టుబడులు 2030 నాటికి 90 ట్రిలియన్​ యెన్​ (870 బిలియన్​ డాలర్లు), 2050 నాటికి 190 ట్రిలియన్​ యెన్​ (1.8 ట్రిలియన్​​ డాలర్లు) లక్ష్యంగా నిర్ణయించింది.

ఇదీ చూడండి:దేశార్థికానికి ముప్పుగా మారిన కాలుష్యం

ABOUT THE AUTHOR

...view details