బంగ్లాదేశ్‌లో జమాత్ ఈ ఇస్లామి గ్రూప్ సీనియర్ నేత షాజహాన్ చౌధరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గత మార్చిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా చిట్టగాంగ్‌లో అల్లర్లకు ప్రేరేపించారన్న అభియోగాలపై శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
మోదీ పర్యటనలో హింసకు కుట్ర- జమాత్ నేత అరెస్ట్
జమాత్ ఈ ఇస్లామి గ్రూప్ సీనియర్ నేత షాజహాన్ చౌధరిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత మార్చిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా చిట్టగాంగ్‌లో అల్లర్లకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యలంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు .
బంగ్లాదేశ్‌లో జమాత్ సీనియర్ నేత అరెస్ట్
చౌధరి గత ప్రభుత్వ హయంలో ఎంపీగా ఎన్నికయ్యారు. అలానే గత ప్రభుత్వ కూటమిలో జమాత్ కీలక భాగస్వామిగా వ్యవహరించింది. గత మార్చి 26, 27 తేదీల్లో నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా.. నిరసనలు తెలుపుతూ హెఫాజత్ వర్గం అల్లర్లకు పాల్పడింది. ఈ ఘటనల్లో నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. విధ్వంసం సృష్టికి హెఫాజత్ వర్గంతో కలిసి షాజహాన్ కుట్రపన్నారని పోలీసులు ఆదివారం వెల్లడించారు.
ఇదీ చూడండి:గాజాపై మరోమారు ఇజ్రాయెల్ రాకెట్ల వర్షం!
Last Updated : May 17, 2021, 7:03 AM IST