పుల్వామా దాడికి బాధ్యులం తామేనని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఒప్పుకున్నప్పటికీ పాకిస్థాన్ అంగీకరించకపోవటం బాధాకరమని భారత విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి జైషే మహ్మద్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టింది.
''జైషేకు అధికార ప్రతినిధిగా పాక్'' - రవీష్‌కుమార్
జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధికార ప్రతినిధిగా పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి వ్యవహరిస్తున్నారని భారత్ విమర్శించింది.
![''జైషేకు అధికార ప్రతినిధిగా పాక్''](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2647812-980-05ccda8d-dab5-4398-80a9-d01c15ec676b.jpg)
''జైషేకు అధికార ప్రతినిధిగా పాక్''
''జైషేకు అధికార ప్రతినిధిగా పాక్''
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు. ''పుల్వామా దాడికి బాధ్యులమని జైషే మహ్మద్ ఒప్పుకోలేదు. దీనిపై కొంత సందిగ్ధం ఉంది. జైషే నాయకత్వాన్ని సంప్రదించాం. పుల్వామాకు బాధ్యులు తాము కాదని చెప్పారు.'' అని ప్రకటించారు.
పాకిస్థాన్ జైషే మహ్మద్‌ను కాపాడుతోందా? అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోందా?
- రవీష్ కుమార్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి.