విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయ్శంకర్ తన తొలి విదేశీ పర్యటనను ప్రారంభించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. పర్యటనలో భాగంగా భూటాన్ ప్రధానమంత్రితో పాటు విదేశాంగ అధికారులతో సమావేశం కానున్నారు జయ్శంకర్. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయని రవీశ్ కుమార్ ప్రకటించారు.
నేడు భూటాన్ పర్యటనకు విదేశాంగ మంత్రి - Jaishankar
విదేశాంగ మంత్రి జయ్శంకర్ భూటాన్ పర్యటన చేయనున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు భూటాన్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా భూటాన్ ప్రధాని, విదేశాంగశాఖ అధికారులతో చర్చలు జరపనున్నారు.
భూటాన్ పర్యటనకు విదేశాంగ మంత్రి జయ్శంకర్
సుష్మా స్వరాజ్ అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మంత్రి వర్గంలో విదేశాంగశాఖ మంత్రిగా జైశంకర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం తన తొలి విదేశీ పర్యటన భూటాన్లో చేయనున్నారు.
ఇదీ చూడండి : కేంద్రంలో 'నెం-2' అమిత్ షా యేనా?
Last Updated : Jun 7, 2019, 8:17 AM IST