మారిషస్లో భారత హై కమిషన్కు చెందిన రాయబార కార్యాలయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రారంభించారు. ఈ పర్యావరణరహిత ప్రాజెక్టు నూతన భారతదేశ ఔన్నత్యానికి నిదర్శనమని ఈ సందర్భంగా అన్నారు. భారతదేశ సహాయంతో నిర్మించిన 950 హౌసింగ్ యూనిట్లను పర్యవేక్షించారు.
మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, విదేశాంగ మంత్రి అలాన్ గనూ సమక్షంలో భారత దౌత్యకార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినట్లు భారత హైకమిషన్ పేర్కొంది.
"మారిషస్ సహకారం ఆదర్శప్రాయం. ఈ ప్రాజెక్టును ఉప ప్రధాని, గృహనిర్మాణ శాఖ మంత్రి లూయిస్ స్టీవెన్ ఒబీగాడోతో పర్యవేక్షించాను. భారత్ సహకారంతో నిర్మించిన 956 హౌసింగ్ యూనిట్లనూ త్వరలోనే ప్రారంభిస్తాం. భారత్ గర్వించేలా చేసిన వర్కర్లకు ధన్యవాదాలు."