హాంకాంగ్‌కు చెందిన హాలీవుడ్ స్టార్ కథానాయకుడు జాకీ చాన్.. తాను చైనా అధికార పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ)లో చేరాలనకుంటున్నట్లు చెప్పారు. బీజింగ్‌లో గురువారం నిర్వహించిన ఓ చర్చా కార్యాక్రమంలో జాకీ చాన్ ఈ మేరకు వెల్లడించారు.
జులై 1న సీపీసీ వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన కీలక ప్రసంగంపై చైనా సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చైనా ఫిల్మ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీ చాన్ ఈ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీలో చేరికపై తన ఆసక్తిని బయటపెట్టారు.
"సీపీసీ గొప్పతనాన్ని నేను చూడగలను. సీపీసీ వందేళ్లలోపు ఏదైతే చేస్తానని హామీ ఇచ్చిందో దాన్ని కొన్ని దశబ్దాల్లోనే నెరవేర్చగలదు. సీపీసీలో నేను సభ్యుడిని అవ్వాలనుకుంటున్నాను."
-జాకీ చాన్, హాలీవుడ్ కథానాయకుడు