తెలంగాణ

telangana

ETV Bharat / international

'బంగబంధు బతికుంటే మరోలా పరిస్థితులు' - బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు బంగబంధు హత్యకు గురికాకపోయి ఉంటే మన ఉపఖండం మరోలా ఉండేదన్నారు ప్రధాని మోదీ. ఆయనది సరిహద్దులు, విభజనలు వంటి పరిమితులకు మించిన దృక్కోణమని కొనియాడారు. బంగ్లా పర్యటనకు ముందు బంగబంధుపై ప్రత్యేక వ్యాసం రాశారు మోదీ.

Bangabandhu, modi
బంగబంధు రెహ్మాన్‌ బతికుంటే..: మోదీ

By

Published : Mar 26, 2021, 12:16 PM IST

బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు, బంగబంధు షేర్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ హత్య దక్షిణాసియా పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపించిందని, ఆయన బతికుంటే బంగ్లాదేశ్‌, ఈ ప్రాంతం మరోలా ఉండేదని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. బంగ్లా పర్యటనకు ముందు ఆ దేశ పత్రిక 'ది డెయిలీ స్టార్‌'లో మోదీ ప్రత్యేకంగా ఆర్టికల్‌ రాశారు. 'ఇమేజింగ్‌ ఏ డిఫరెంట్‌ సౌత్‌ ఆసియా విత్‌ బంగబంధు' పేరుతో రాసిన ఈ కథనంలో దేశం కోసం రెహ్మాన్‌ చేసిన కృషిని కొనియాడారు.

"బంగబంధు జీవితం, ఆయన పోరాటాలను ఒకసారి గుర్తుచేసుకున్నట్లయితే.. ఈ ఆధునిక దిగ్గజం హత్యకు గురికాకపోయి ఉంటే మన ఉపఖండం మరోలా ఉండేది. ఆయన మరణం మన ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా రెహ్మాన్‌ తన పోరాటానికి కట్టుబడి ఉన్నారు. భౌతిక సరిహద్దులు, సామాజిక విభజన వంటి పరిమితులను మించిన దృక్కోణం కలిగిన గొప్ప నేత ఆయన. బంగబంధు జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం" అని మోదీ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. బంగబంధు జీవించి ఉంటే.. భారత్‌, బంగ్లా మధ్య 2015లో జరిగిన భూసరిహద్దు ఒప్పందం ఎప్పుడో పూర్తయి ఉండేదని అభిప్రాయపడ్డారు.

పొరుగుదేశాలతో మైత్రిబంధాన్ని కొనసాగిస్తున్న బంగ్లా.. ఆత్మవిశ్వాసంతో నాటి బాధాకర యుద్ధ పరిస్థితుల నుంచి వేగంగా ముందుకు సాగుతోందని మోదీ ఈ సందర్భంగా అన్నారు. భారత్‌, బంగ్లా మధ్య బలమైన భాగస్వామ్యం కోసం మళ్లీ ధైర్యంగా అడుగేయాల్సిన సమయం ఆసన్నమైందని రాసుకొచ్చారు.

మహమ్మారి తర్వాత తొలి పర్యటన

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ నేడు(శుక్రవారం) బంగ్లాదేశ్‌ వెళ్లారు. కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత మోదీ వెళ్లిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. ఈ ఉదయం ఢాకా చేరుకున్న ప్రధాని మోదీకి.. ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా సాదర స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌ జాతీయ దినోత్సవం, బంగబంధు శతజయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా తుంగైపురలోని బంగబంధు సమాధిని సందర్శించనున్నారు.

ఇదీ చూడండి:మోదీకి ఘన స్వాగతం పలికిన బంగ్లా ప్రధాని

ABOUT THE AUTHOR

...view details