భారత్-పాకిస్థాన్‌లు గతాన్ని వీడి ఐక్యంగా ముందుకు సాగాలని పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వా వ్యాఖ్యానించారు. తూర్పు, పశ్చిమ ఆసియా మధ్య సంబంధాలు, దక్షిణ, మధ్య ఆసియా సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి స్థిరమైన ఇండో-పాక్ సంబంధాలు కీలకమని ఆయన చెప్పారు.
కశ్మీర్‌లో అనుకూలమైన వాతావరణాన్ని పొరుగుదేశం సృష్టించవలసి ఉంటుందని భారత్‌ను ఉద్దేశించి అన్నారు. వివిధ శక్తుల మధ్య విచ్చలవిడి సంబంధాలు చివరికి మరొక ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తాయని వ్యాఖ్యానించారు.