తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్​ రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్చేనా! - ఇజ్రాయెల్​ రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్చేనా!

ఇజ్రాయెల్​ ప్రధాని ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రానందున రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రస్తుత ప్రధాని బెంజిమన్ నెతన్యాహు.. అధ్యక్షుడు ఇచ్చిన గడువులోగా మెజారిటీని నిరూపించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో 28 రోజుల్లోగా విపక్షనేత బెన్ని గంట్జ్ మెజారిటీ నిరూపించుకోవాలని అవకాశం కల్పించారు అధ్యక్షుడు. ఈ గడువు బుధవారంతో ముగియనుంది.

ఇజ్రాయెల్​ రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్చేనా!

By

Published : Nov 19, 2019, 11:28 AM IST

మధ్య ఆసియా దేశమైన ఇజ్రాయెల్​లో గత కొన్ని వారాలుగా రాజకీయ సంక్షోభం నెలకొంది. సెప్టెంబర్​లో జరిగిన ఎన్నికల్లో 120 స్థానాలున్న పార్లమెంట్​లో ప్రధాన పార్టీలైన లికుడ్​, 'సెంట్రిస్ట్ బ్లూ'కు స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా.. ప్రస్తుత ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహును తొలుత ఆహ్వానించారు అధ్యక్షుడు రూవెన్​ రివ్లిన్​. అయితే నెతన్యాహు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు.

ఈ తరుణంలో ప్రతిపక్ష నేత బెన్ని గ్లంట్జ్​ను ప్రభుత్వ ఏర్పాటుకై 28 రోజుల ముందే ఆహ్వానించారు రూవెన్​. ఇందుకు బెన్నీకిచ్చిన గడువు బుధవారం అర్థరాత్రితో తీరిపోనుంది. ఈ నేపథ్యంలో ఒకే సంవత్సరంలో మూడోసారి సాధారణ ఎన్నికల నిర్వహణకు విముఖత వ్యక్తం చేస్తూ పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నిస్తున్నారు మాజీ ఆర్మీ అధికారి అయిన గంట్జ్.

పార్టీ బలం

బ్లూ అండ్ వైట్(గాంట్జ్)
33
లికుడ్(నెతన్యాహు) 32
జాయింట్ లిస్ట్​(అరబ్) 13
షాస్ 9
ఇజ్రాయిల్ బీటెను 7
యమీనా 7
లేబర్-గెషర్ 6
డెమొక్రాటిక్ యూనియన్ 5


అరబ్​పై వైఖరేమిటో..

గంట్జ్​ ప్రధానంగా అరబ్​ దేశాల మద్దతుపై ఆధారపడుతున్నారు. అయితే గతవారం ఇస్లామిక్ స్టేట్​, ఇజ్రాయిల్ బృందాల మధ్య ఘర్షణ వాతారణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ విధమైన పాలనా విధానాన్ని గంట్జ్ అవలంబిస్తారనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కీలకంగా లీబర్​మాన్..

జాతీయవాద ఇజ్రాయెల్ బీటెను పార్టీనేత ఎవిగ్డార్ లీబర్​మాన్​ను తమతో కలిసిరావాలని గంట్జ్ ఆహ్వానిస్తున్నారు. అయితే లీబర్​మాన్.. గంట్జ్​తో కలిసినా వారికి మరో 13 సీట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం అంతమంది సభ్యుల మద్దతు కావాలంటే అరబ్​ పార్టీలను సంకీర్ణంలో చేర్చుకోవాలసి ఉంటుంది.

అయితే లీబర్​మాన్.. అరబ్​ పార్టీతో కలిసేందుకు ఎంతమాత్రం సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో ఈ చర్చలకు ముగింపు పలికేందుకు నేటి మధ్యాహ్నం 12 గంటలవరకు గడువు విధించారు. ఒకవేళ చర్చ ముగింపునకు రాకపోతే తనదారి.. తాను చూసుకుంటానని లీబర్​మాన్ వెల్లడించారు.

ఇదీ చూడండి: కార్పొరేట్ సామాజిక బాధ్యత మరచిన పెద్దలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details