ప్రపంచంలో అత్యధిక శాతం శాకాహారులున్న దేశం ఇజ్రాయెల్. ఆ దేశంలోని తెల్ అవివ్ నగరానికి 'వెజిటేరియన్ సిటీ'గా ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ నిర్వహించిన రెండు రోజుల శాఖాహార ఉత్సవాలు భోజన ప్రియులకు అమితానందం కలిగించాయి. దాదాపు అన్ని రకాల శాకాహార వంటకాలను ఔత్సాహికులు ఆస్వాదించారు. హాట్ డాగ్స్, చీజ్, కాక్టెయిల్స్ను రుచి చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. ఇజ్రాయెల్లో పేరుగాంచిన రెస్టారెంట్లన్నీ ఈ ఉత్సవంలో పాల్గొన్నాయి. వందల రకాల వంటకాలను ప్రదర్శించి ఆకట్టుకున్నాయి.
"గుడ్లు, పాల ఉత్పత్తులు వినియోగించని కోశర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్య ఉండదు. ఇలాంటి ఆహారమే మేలు."
-ఆండ్రియా, శాకాహార ప్రియులు
'వేగన్ ఫ్రెండ్లీ' సంస్థ ఈ వేడుకను నిర్వహించింది. ఈ సంస్థకు చెందిన దాదాపు 500 మంది వలంటీర్లు ఫెస్టివల్లో పాల్గొన్నారు.