తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్‌లోనూ పెగసస్​ రగడ.. మాజీ ప్రధాని కుమారుడి ఫోన్ హ్యాక్​! - police use of Pegasus spyware in Israel

Israel Police use of Pegasus: ఇజ్రాయెల్‌ పోలీసులు పెగసస్​ స్పైవేర్‌ను ఉపయోగించి ఆ దేశంలోని డజన్ల కొద్ది ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేశారంటూ ఓ మీడియా సంస్థ తన కథనంలో రాసుకొచ్చింది. హ్యాక్‌కు గురైన వారిలో దేశ మాజీ ప్రధాని బెంజ్‌మిన్‌ నెతన్యాహు కుమారుడు కూడా ఉన్నట్లు పేర్కొంది.

Pegasus spyware
పెగాసస్‌

By

Published : Feb 8, 2022, 7:22 AM IST

Israel Police use of Pegasus:పెగాసస్‌ స్పైవేర్‌కు సంబంధించి ఇజ్రాయెల్‌కు చెందిన ఓ మీడియా సంస్థ సంచలన విషయాలను బయటపెట్టింది. ఇజ్రాయెల్‌ పోలీసులు ఈ స్పైవేర్‌ను ఉపయోగించి ఆ దేశంలోని డజన్ల కొద్ది ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేసిందంటూ తన కథనంలో రాసుకొచ్చింది. హ్యాక్‌కు గురైన వారిలో దేశ మాజీ ప్రధాని బెంజ్‌మిన్‌ నెతన్యాహు కుమారుడు, పలువురు సామాజిక కార్యకర్తలు, సీనియర్‌ ప్రభుత్వాధికారులు ఉన్నారని పేర్కొంది.

మీడియా సంస్థ కథనంపై స్పందించిన పోలీస్‌ కమిషనర్‌ కోబి షాబ్తాయ్‌.. దీనిపై ఒక న్యాయమూర్తి నేతృత్వంలో అంతర్గత, స్వతంత్ర విచారణ జరిపించాలని ప్రజాభద్రత మంత్రి ఒమర్‌ బర్లేవ్‌ను కోరారు. విచారణలో అవకతవకలను గుర్తించినట్లయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ కోబి తెలిపారు.

పెగాసస్‌ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ రూపొందించింది. కాగా.. ఈ స్పైవేర్‌ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రభుత్వాలు అక్రమంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీని ఇతర దేశాలకు విక్రయించడాన్ని రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు. దీని వల్ల వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతుందంటున్నారు. భారత్‌లోనూ గత కొన్నాళ్లుగా పెగాసస్‌ వివాదం కొసాగుతూనే ఉంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, పలువురు ప్రముఖులపై భాజపా ప్రభుత్వం స్పైవేర్‌ను ఉపయోగిస్తుందని ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఇటీవల ఓ సాంకేతిక కమిటీని సైతం నియమించిన విషయం తెలిసిందే..

ఇదీ చూడండి:అంతర్గత పోరులో మయన్మార్‌- కొనసాగుతున్న సైన్యం దాష్టీకాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details