తెలంగాణ

telangana

ETV Bharat / international

సిరియాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు! - దక్షిణ సిరియాపై క్షిపణి దాడులు

డమస్కస్, దక్షిణ సిరియా ప్రాంతాలే లక్ష్యంగా ఇజ్రాయెల్​ క్షిపణులతో విధ్వంసం సృష్టించినట్లు సమాచారం. ఈ దాడిలో జరిగిన ప్రాణనష్టంపై స్థానిక మీడియా స్పష్టత ఇవ్వలేదు.

israel missile attacks on syria
సిరియాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు

By

Published : Apr 8, 2021, 6:27 AM IST

గురువారం తెల్లవారుజామున సిరియాపై క్షిపణి దాడులు చేసింది ఇజ్రాయెల్. సిరియా రాజధాని డమస్కస్, దక్షిణ సిరియా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు సిరియా స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఎంత మంది మృతిచెందారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు లెబనాన్​ మీదుగా ప్రయాణిస్తూ సిరియాపై ఈ దాడులు జరిపిందని పేర్కొంది.

లెబనాన్- సిరియా సరిహద్దు ప్రాంతంలో సిరియా డిఫెన్స్ మిసైల్​ పేలినట్లు లెబనాన్​ మీడియా తెలిపింది.

సిరియాలో.. ఇరాన్​తో సంబంధాలున్న మిలిటరీ బృందాలే లక్ష్యంగా ఇజ్రాయెల్​ పలుమార్లు క్షిపణి దాడులు జరిపింది.

ఇదీ చదవండి:బంగాల్‌లో ముగ్గురు ఎన్నికల అధికారుల బదిలీ

ABOUT THE AUTHOR

...view details