కరోనాకు కళ్లెం వేసే అద్భుతమైన టీకా(వ్యాక్సిన్)ను సిద్ధం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మానవులపై ప్రయోగాలు చేయాల్సి ఉందని, ప్రస్తుత సెలవుల అనంతరం ఇది మొదలవుతుందని 'ఇజ్రాయెల్ జీవ పరిశోధన సంస్థ'(ఐఐబీఆర్) తెలిపింది.
'కరోనాకు కళ్లెం వేసే అద్భుతమైన టీకా సిద్ధం చేశాం' - Israel vaccine against COVID-19
కరోనావైరస్ నయం చేసే అద్భుతమైన టీకా తయారు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ టీకాను మానవులపై ప్రయోగించాల్సి ఉందని తెలిపింది. ప్రస్తుత సెలవుల అనంతరం ఇది మొదలవుతుందని స్పష్టం చేసింది.
'కరోనాకు కళ్లెం వేసే అద్భుతమైన టీకా సిద్ధం చేశాం'
కరోనా వైరస్ను ఎదుర్కొనే ప్రతినిరోధకాలను తయారు చేసే వ్యాక్సిన్ ఉత్పత్తిలో పురోగతిని ఐఐబీఆర్ వర్గాలు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్కు గురువారం వివరించాయి.