తెలంగాణ

telangana

ETV Bharat / international

కాబుల్​లో రాకెట్ దాడులు.. మా పనే: ఇస్లామిక్ స్టేట్ - afghanistan kabul attack

కాబుల్​లో సోమవారం జరిగిన రాకెట్ దాడులకు(kabul rocket attack) కారణం తామేనని ఇస్లామిక్ స్టేట్(Islamic State) పేర్కొంది. ఆరు రాకెట్లు ప్రయోగించినట్లు తెలిపింది.

kabul attacks
కాబుల్ దాడులు

By

Published : Aug 30, 2021, 7:07 PM IST

కాబుల్​లో తాజాగా జరిగిన రాకెట్ దాడులకు(Kabul rocket attack) తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల బృందం ప్రకటించుకుంది. కత్యుషా రకానికి చెందిన ఆరు రాకెట్లను ప్రయోగించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ స్టేట్(Islamic State) మీడియా విభాగం వెల్లడించింది.

ఇస్లామిక్ స్టేట్.. సోమవారం ఉదయం ప్రయోగించిన ఈ రాకెట్లను రక్షణ వ్యవస్థ ద్వారా అమెరికా సైన్యం అడ్డుకుంది. ఓ వాహనం వెనుక భాగం నుంచి మొత్తం ఐదు రాకెట్లు ప్రయోగించినట్లు తెలిపింది. ఈ రాకెట్లు ఎయిర్​పోర్ట్ సమీపంలోని ఓ ప్రాంతంలో ల్యాండ్ అయ్యాయి. అయితే, ఈ దాడుల వల్ల పౌరుల తరలింపు ప్రక్రియకు ఆటంకం కలగలేదు.

అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం బయటకు వెళ్లిపోతునున్న నేపథ్యంలో కాబుల్​లో వరుస దాడులు జరుగుతున్నాయి. గురువారం ఐసిస్-కే ఉగ్ర సంస్థ ఆత్మాహుతి దాడులకు తెగబడింది. ఈ ఘటనలో సుమారు 180 మంది మరణించారు. అందులో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు.

ఇదీ చదవండి:క్లైమాక్స్​కు అమెరికా-అఫ్గాన్ కథ.. డెడ్​లైన్​కు 24 గంటలే!

ABOUT THE AUTHOR

...view details