ఐసిస్ అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ మరణించినట్లు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ ధ్రువీకరించింది. బకర్ వారసుడిగా అబి ఇబ్రహీం అల్ హషీమి అల్ ఖురేషీ.. ఐసిస్‌ను నడిపించనున్నాడని ఓ ఆడియో సందేశంలో స్పష్టం చేసింది. ఐసిస్ ప్రధాన మీడియా మాధ్యమం అల్ ఫుర్ఖాన్ ఫౌండేషన్ ద్వారా ఈ ఆడియోను విడుదల చేసింది.
బాగ్దాదీతో పాటు ఆ సంస్థ అధికార ప్రతినిధి, బాగ్దాదీకి అత్యంత సన్నిహితుడైన అబు హసన్ అల్ ముహాజిర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అలాగే 'బాగ్దాదీ మరణంతో అమెరికన్లు సంతోషించకండి' అని హెచ్చరించింది.