తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఐసిస్‌ ముప్పు కాదు.. కానీ, తలనొప్పి వ్యవహారం' - ఐసిస్​ ముప్పు

ఐసిస్‌ను అఫ్గానిస్థాన్‌కు(ISIS in Afghanistan) ముప్పుగా పరిగణించడం లేదు.. కానీ, అదొక తలనొప్పిలా మారిందని తాలిబన్ల ప్రతినిధి, మంత్రి జబిహుల్లా ముజాహిద్‌(Taliban spokesman) పేర్కొన్నారు. వారిని త్వరలోనే అణచివేస్తామని చెప్పారు. వారి రహస్య స్థావరాలను ధ్వంసం చేసేందుకూ ముమ్మర ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Terrorism in Afghanistan
తాలిబన్ల ప్రతినిధి, మంత్రి జబిహుల్లా ముజాహిద్‌

By

Published : Oct 9, 2021, 12:22 PM IST

అఫ్గాన్‌కు ఐసిస్‌ ఉగ్రవాదుల(ISIS in Afghanistan) నుంచి ముప్పు పొంచి ఉందనే వాదనను కొట్టిపారేస్తూ.. వారిని త్వరలోనే అణచివేస్తామని తాలిబన్లు(Afghanistan Taliban) పేర్కొన్నారు. ఐసిస్‌ను అఫ్గానిస్థాన్‌కు ముప్పుగా పరిగణించడం లేదు.. కానీ, అదొక తలనొప్పిలా మారిందని తాలిబన్ల ప్రతినిధి, మంత్రి జబిహుల్లా ముజాహిద్‌(Taliban spokesman) పేర్కొన్నట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. 'ఐసిస్‌.. దేశంలో కొన్ని చోట్ల చేసే పనులు తలనొప్పిగా మారాయి. కానీ.. ఆయా ఘటనలు జరిగిన వెంటనే వారిని తరిమికొట్టాం. వారి స్థావరాలూ కనుగొన్నాం' అని ముజాహిద్‌ వివరించారు. ఈ క్రమంలోనే తాలిబన్లు ఇటీవల కాబుల్ శివారులో ఐసిస్- ఖొరసాన్‌కు(ISIS in Afghanistan) చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం. వారి రహస్య స్థావరాలను ధ్వంసం చేసేందుకూ ముమ్మర ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి.

'ఇప్పటికిప్పుడు ముప్పు లేదు'

ఇటీవల కాబుల్‌లోని ఈద్గా మసీదు వద్ద ఆత్మాహుతి(Suicide attack) దాడి జరిగిన విషయం తెలిసిందే. జబిహుల్లా ముజాహిద్ తల్లి సంస్మరణ కార్యక్రమానికి హాజరైన తాలిబన్లు, పౌరులే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో పది మందికి పైగా మరణించగా, 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాలు వైదొలిగాక నగరంలో జరిగిన మొదటి ప్రధాన ఉగ్రదాడి ఇదే. ఈ ఘటన అనంతరం తాలిబన్లు.. ఐసిస్‌ ఉగ్రవాదుల ఏరివేత మొదలుపెట్టారు.

మరోవైపు అఫ్గాన్‌ భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాల విషయమై గత నెలలో అమెరికా జాయింట్ చీఫ్స్ ఛైర్మన్‌ జనరల్ మార్క్ మిల్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఆరు నుంచి 36 నెలల్లో అఫ్గాన్‌లో అల్ ఖైదా, ఐసిస్ మళ్లీ బలపడేందుకు అవకాశం ఉందని చెప్పారు. కానీ, ఇప్పటికిప్పుడు వారి నుంచి ఉగ్ర ముప్పు 9/11 దాడుల ఘటన కంటే తక్కువేనని వివరించారు.

ఇదీ చూడండి:పోలీసులుగా మారిన తాలిబన్లు- వీధుల్లో తుపాకులతో పహారా

ABOUT THE AUTHOR

...view details