ఇరాక్ ప్రధానమంత్రి(Iraq Pm News) ముస్తాఫా అల్-కధామీపై ఆదివారం హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణహాని తప్పింది. దుండగులు ఆయన(Iraq Pm News) ఇంటిపై డ్రోన్ దాడులకు యత్నించి విఫలమయ్యారు.
బాగ్దాద్‌లోని ముస్తాఫా(Iraq Pm News) నివాసంపై పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ దాడికి దుండగులు విఫలయత్నం చేశారని ఇరాక్ సైన్యం తెలిపింది. అయితే.. ఆయనకు ఎలాంటి హాని జరగలేదని, క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ఈ దాడులకు పాల్పడినవారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పింది.
మరోవైపు.. ప్రధాని ముస్తాఫా కూడా ట్విట్టర్ వేదికగా తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు.