బాగ్దాద్‌లోని అమెరికన్ రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన రాకెట్ దాడిని.. ఇరాక్ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది.
యూఎస్ ఎంబసీపై రాకెట్ దాడి.. అడ్డుకున్న ఇరాక్ - యూఎస్ ఎంబసీపై రాకెట్ దాడి
ఇరాక్ వైమానిక రక్షణ దళం.. బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన రాకెట్ దాడిని అడ్డుకుంది. అయితే గుర్తు తెలియని శత్రువులు ప్రయోగించిన ఆ రాకెట్ బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్ పరిధిలో కుప్పకూలిందని అల్ అరేబియా వార్తాసంస్థ తెలిపింది.
యూఎస్ ఎంబసీపై రాకెట్ దాడిని అడ్డుకున్న ఇరాక్
అల్ అరేబియా వార్తా సంస్థ ప్రకారం, యూఎస్ ఎంబసీని లక్ష్యంగా చేసుకుని జరిగిన రాకెట్ దాడిని.. ఇరాక్ వైమానిక దళం అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయితే దానిని సమర్థవంతంగా అడ్డుకోలేకపోయింది. దీనితో ఆ రాకెట్ బాగ్దాద్ గ్రీన్ జోన్ పరిధిలో పడింది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరో ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:కొవిడ్ పరీక్షల కోసం చౌకైన విద్యుత్ రహిత సెంట్రిఫ్యూజ్